27 March, 2026 | 1:39 AM

మార్కెట్‌ను అజీజ్‌నగర్‌కు షిఫ్ట్ చేయండి

27-03-2026 12:00 AM

అసెంబ్లీలో ప్రస్థావించిన చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ళ మార్చి 26(విజయక్రాంతి): గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ ను చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్ కు తరలించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అసెంబ్లీలో ప్రస్థావించారు. అజీజ్ నగర్ లోని ప్రభుత్వ స్థలంలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేస్తే చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, నవాబ్ పేట్ మండలాల రైతులకు మేలు చేకూరుతుందని సభాపతిని కోరారు.

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి నెదురు మల్లి జనార్దన్ రెడ్డి హయాంలోని మార్కెటింగ్ శాఖ మంత్రి కమతం రాంరెడ్డి ఆధ్వర్యంలో పశ్చిమ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ, పరిగి, తాండూర్, వికారాబాద్ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేశారని చెప్పారు. నేటికీ 34 సంవత్సరాలు అయినదన్నారు. నాటి పరిస్థితులకు అనుగుణంగా 30 సంవత్సరాలకుగాను రైతులు ప్రజల ప్రయోజనార్ధం ఈ మార్కెట్ ఏర్పాటు చేశారని చెప్పారు. మార్కెట్ కోసం మొయినాబాద్ అజీజ్ నగర్ లో ఇదివరకే భూ సేకరణ పూర్తయిందని చెప్పుకొచ్చారు. అజీజ్ నగర్ కు షిఫ్ట్ చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని కోరారు.