13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

నిర్మాణాలకు నిధులు మంజూరు చేయండి

27-03-2026 12:02 AM

మేడ్చల్ అర్బన్ మార్చి 26(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని 24వ మున్సిపల్ వార్డులో సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణాలకు మల్కాజిగిరి బిజెపి ఎంపీ మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ ను నిధులు మంజూరు చేయాలని కోరినట్లు మున్సిపల్ బిజెపి కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ఎంపి  రాజేందర్ ఎంపి ఫండ్ తో రోడ్లు, అండర్ డ్రైనేజీలు లేని ప్రాంతాలను వర్క్ ఇన్స్పెక్టర్ తో కలిసి పరిశీలించి వాటి నిర్మాణానికి కావలసిన ఎస్టిమేట్ సిద్ధం చేయించ డం జరిగిందని తెలిపారు.

ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని 24వ మున్సిపల్ వార్డులో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయుటకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని మల్కాజిగిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ స్పష్టం చేసినట్లు కౌన్సిలర్ అర్చన తెలిపారు.ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని 24వ మున్సిపల్ వార్డుకు చెందిన సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణాలకు ఎంపీ నిధులను నుండి మంజూరి చేయడానికి కృషి చేస్తానని బిజెపి ఎంపి హామీ ఇచ్చినట్లు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ వెల్లడించారు.