14 July, 2026 | 11:52 AM

Breaking News

మహారాష్ట్రలో గుట్కా నిషేధం.. తెలంగాణ నుండి జోరుగా రవాణా!   •   లులు మాల్‌లో గన్ కలకలం   •   కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   Dollar vs Rupee: తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •  

భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలి

09-07-2026 12:13 AM

రూ.లక్ష కోట్ల భూమిని ఎలాంటి రుసుం లేకుండా ఐడీఎల్‌కు ధారాదత్తం

బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చింతల శ్రీనివాస్ రెడ్డి

ముషీరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూకట్‌పల్లిలోని రంగనాయక స్వామి దేవాలయం సమీపంలోని లక్ష కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని ఎలాంటి రుసుం చెల్లించకుండా ఐడీఎల్ కంపెనీకి అప్పనంగా ధారదత్తం చేసిందని బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యలు చింతల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

ఈ భూ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెలికి, ఆ భూమిని స్వాధీనపరచుకుని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హై కోర్ట్ సీనియర్ న్యాయవాది పాశం కృష్ణారెడ్డి, శ్రీనివాస చారిలతో కలిసి ఆయన మాట్లాడారు.

కూకట్ పల్లిలో సర్వే నెంబర్స్ 627, 629, 1011/1, 1011/2, 1011/3, 1011/4, 1011/12 డినోనేటర్ లిమిటెడ్ (ఐడీఎల్) ప్రస్తుతం గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జీవోసీఎల్) కంపెనీకి 2021లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ వెయ్యి రూపాయలకు 128 ఎకరాల భూమిని సదురు కంపెనీకి సేల్ సర్టిఫికెట్ ఇచ్చారని వివరించారు.

ఈ సేల్ సర్టిఫికెట్ ఆధారం చేసుకుని జీవోసీల్ కంపెనీ స్క్వేర్ స్పేస్ ఇన్ఫ్రా సిటీకి 27 ఎకరాల 24 గుంటలు, ఇందూజ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ 32 ఎకరాలు, యాగ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లకు 5 ఎకరాల 24 గంటలు విక్రయించిందని ఆయన వెల్లడించారు. అదే విధంగా సెప్టెంబర్ 2023లో 333 ఎకరాలను మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ అమోయ్ కుమార్ ఎలాంటి రుసుం లేకుండా.. ఆ కంపెనీలకు ధారాదత్తం చేశారని తెలిపారు.

ఈ సర్వే నంబర్స్ అనుకొని 700 ఎకరాలు రిజర్వు ఫారెస్ట్ భూమి ఉందని, ఆ భూమి మొత్తాన్ని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ కబ్జా చేసి బహుళ అంతస్తులు భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు.ఈ విషయంపై లోకాయుక్తలో కేసు వేశానని, సీసీఎల్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ భూముల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించి అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ఈ భూ కుంభకోణంలో పాలు పంచుకున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.