12 August, 2026 | 12:51 AM

ప్రైవేట్ కాలేజీల ఎన్‌వోసీలపై సమగ్ర విచారణ జరపాలి

12-08-2026 12:00 AM

విద్యార్థుల భద్రతతో రాజీ పడొద్దు: పీడీఎస్‌యూ డిమాండ్ 

ముషీరాబాద్,ఆగస్టు 11 (విజయక్రాంతి): ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫైర్ ఎన్ వోసీలు, బిల్డింగ్ పర్మిషన్లు, స్టెబిలిటీ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలని పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కే. పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శి కె.ఎల్. గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదర్గూడ లోని ఎన్‌ఎస్‌ఎస్ లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నకిలీ పత్రాలు సమర్పించిన కాలేజీలతో పాటు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రతతో రాజీపడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి.ఎం. వంశీ, జి. ప్రవీణ్, డి. గణేష్, శివ తదితరులు పాల్గొన్నారు.