12 August, 2026 | 2:09 AM

వరుణయాగంపై విమర్శలా?

12-08-2026 12:49 AM
  1. కేసీఆర్ చేసిన విషయం మర్చిపోయారా? 
  2. ప్రభుత విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి) : రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వరుణ యాగంపైన బీఆర్‌ఎస్ నేతలు కామెంట్ చేసి స్థాయికి దిగజారి పోయారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. గతంలో కేసీఆర్ అ యుత చండీ యాగం, సహస్ర చండీ యా గం, రాజశ్యామల యాగం, నవగ్రహ చండీ యాగాలను నిర్వహించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మా ట్లాడుతూ 2015 డిసెంబర్‌లో కేసీఆర్ చేసిన అయుత చండీ యాగానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారైన విషయం మర్చిపోయారా? అని ఆది శ్రీనివాస్ నిలదీశారు.   వేములవాడలో వరుణయాగం చేశాం, కొండగట్టు గిరి ప్రదక్షణలు చేశామని తెలిపారు. ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఎలా నీళ్లు ఇ వ్వాలి, ఎప్పుడు పంపులు ఆన్ చేయాలో మాకు తెలుసని , ఈ విషయంలో హరీశ్‌రా వు నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ హితవు పలికారు. 

కాళేశ్వరం లో కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని హరీశ్ రావు ఇలాగే హడావుడి చేశాడని, వరద నీటి తో ఎల్లంపల్లి నిండడంతో ఆయన గొంతు మూగబోయిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. కన్నెపల్లి పంపుల డ్రామా పాచిక పారకపోవడంతో ఇప్పుడు రిజర్వాయర్లను నింపాలం టూ హరీశ్ రావు డ్రామా మొదలు పెట్టాడని ఆయన మండిపడ్డారు. కరువు సమ యంలో రైతులకు అండగా నిలబడకుండా విమర్శలు చేయడం మంచిది కాదన్నారు.