12 August, 2026 | 2:08 AM

తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు

12-08-2026 12:51 AM

జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్ రెడ్డి 

 తాడ్వాయి,ఆగష్టు, 11( విజయ క్రాంతి ): వరి విత్తనాలను అలేక్ మిషన్ ద్వారా డైరెక్ట్ సోయింగ్ సాగు విధానం తో తక్కువ నీరు, తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు  పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల గ్రామంలో మంగళవారం ఆయన చాకలి రామస్వామి అనే రైతు డైరెక్ట్ షోయింగ్ విధానంతో సాగుచేసిన వరి పొలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... చాకలి రామస్వామి అలెక్ మిషన్ తో డైరెక్ట్ సోయింగ్ విధానం ద్వారా వరి విత్తనాలను అలికి వరి పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. పంట పెరుగుదల, పోషక నిర్వహణ,

నీటి వినియోగ సామర్థ్యాలు, కలుపు నివారణ సమగ్ర పంట యాజమాన్యంపై రైతుకు సూచనలు అందించారు. ప్రత్యక్ష విత్తన వరి సాగు ఉత్తమమైన పద్ధతి అని తెలిపారు. రైతులు ఈ పద్ధతితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు.ఈ విధానంతో రసాయనిక ఎరువుల వాడకం తగ్గి దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏడిఏ సుధా మాధురి, మండల వ్యవసాయ అధికారి నర్సింలు, గ్రామ సర్పంచ్ కోర్ని నర్సింలు, ఏఈఓ శివ చైతన్య తదితరులు పాల్గొన్నారు.