రాంనగర్‌లో ఘనంగా ఫలహారం బండి, అమ్మవారి ఊరేగింపు
ముషీరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రేషం మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం రాంనగర్ డివిజన్ ఎస్‌ఆర్టీ కాలనీ నుంచి జెమినీ కాలనీలోని అమ్మవారి ఆలయం వరకు ఘనంగా జరిగింది.
భక్తులు, బీఆర్‌ఎస్ నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మాజీ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకుడు ముఠా జైసింహలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఊరేగింపు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సిరిగిరి శ్యామ్, అజయ్ ముదిరాజ్, కల్వ గోపి, నేత శ్రీను, జంగయ్య గౌడ్, రాకం సత్యనారాయణ, వెంకటేష్, అమిత్ బన్నీ, రాజేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






