calender_icon.png 9 December, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరీక్షణకు తెర..!

09-12-2025 01:31:08 AM

  1. జూలపల్లి రోడ్డుకు మోక్షం

6 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు రూ.7 కోట్లు మంజూరు 

సంతృప్తి వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు

మహమ్మదాబాద్, డిసెంబర్ 8: గుంతల మయంగా రోడ్లు ఉంటే ఆ బాటసారి బాధ ఆ ప్రాంత ప్రజలకే కాదు ఆ దారిలో ఎవరు ప్రయాణం కొనసాగించిన నరకయాతన ఉంటుంది. మండల పరిధిలోని జూలపల్లి నుంచి కిష్టం పల్లి బీటీ రోడ్డు వరకు ఆరు కిలోమీటర్ల పొడవునా మంజూరు కావడంతో ఆ ప్రాంత వాసులకు ఎంతో మేలు జరగనున్నది. గత ఐదు ఆరు ఏళ్లుగా అనేక ఇబ్బందులకు అయిన ఆ గ్రామ ప్రజలకు ఈ తీపి కబురు ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని జూలపల్లి గ్రామ ప్రజలు చెబుతున్న మాట. 

రూ. 7 కోట్లు మంజూరు ఉత్తర్వులు జారీ..

గుంతల మయంగా రోడ్డు ఉండడంతో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఏడు కోట్లు మంజూరు చేయడంతో త్వరలోనే ఈ రోడ్డు వేసే ప్రక్రియ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చిన ఎన్నికల సందర్భంగా కొంత ఆగినప్పటికీ వేగంగా పనులు త్వరలోనే ప్రారంభం అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. 

అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

నియోజకవర్గమంతా అభివృద్ధికి కట్టుబడి ఉండి పనిచేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతు న్నాం. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా పని చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. 

- రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి