09-12-2025 01:35:07 AM
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ఐటీ హబ్‌గా, ఇన్నోవేషన్ కారిడా ర్‌గా, ఫార్మాసూటికల్ క్యాపిటల్‌గా, ఏరోస్పేస్ టెక్నాలజీ సెంటర్‌గా హైదరాబాద్ వర్ధిల్లుతున్నదని.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని మరింత పెంచేందుకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 2047 నాటికి దేశం వికసిత భారత్‌గా వెలుగొందాలంటే రాష్ట్రాల సహకారంతోనే ఈ కల సాకారమవుతుందని చెప్పారు.
హైదరాబాద్ నగరం అంటేనే సాంకేతికతో సంప్ర దాయం, శాస్త్ర పరిజ్ఞానంతో ఆధ్యాత్మికత, వారసత్వ సంపదతో సృజనాత్మకత కలగలిసి ఉంటాయని పేర్కొన్నారు. ప్రధానిగా మోదీ అధి కారం చేపట్టినప్పటి నుంచి ప్ర పంచంలోనే శక్తిమంతమైన దేశంగా భారత్ అవతరించిందన్నారు. పేదరిక నిర్మూలన, డిజిటల్ సాధి కారత, వడివడిగా మౌలికవసతుల కల్పన, రైతుల సంక్షేమం, స్టార్టప్స్‌కు ప్రోత్సాహం ఇలా అన్ని రంగాల్లో మున్ముందుకు సాగిపోతున్నదని తెలిపారు.
హైదరాబాద్ కేవలం ఓ రాష్ట్రానికి రాజధాని నగరం కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం లాంటిదని వెల్లడించారు. పరిశ్రమలను, స్టార్టప్స్‌ను, టాలెంట్‌ను, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలన్నారు. 2014 నుంచి 2025 వరకు 748.78 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని, అంతకుముందు దశాబ్దంతో పోలిస్తే ఏకంగా 143 శాతం వృద్ధి నమోదు అయిందన్నారు.
‘ఆత్మ నిర్భ ర్ భారత్’, ‘మేకిన్ ఇండియా’ ద్వారా భారత్ మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా అవతరించిందని చెప్పారు. 2014లో రెండు యూ నిట్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 300 యూనిట్లకు పెరిగిందని తెలిపారు. రక్ష ణ రంగం ఎగుమతులు 2013--14లో రూ. 686 కోట్లు ఉండగా, ఇప్పుడు 34 రెట్లు పెరిగి ఏకంగా రూ.23,622 కోట్లకు ఎగబాకాయన్నారు. ఆపరేషనల్ ఎయిర్ పోర్టులు 2014లో 74 ఉండగా, ఇప్పుడు అది రెట్టిం పై 160కి పెరిగినట్లు తెలిపారు.