09-12-2025 12:46:33 AM
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): మూడు ట్రిలియన్ అనేది సంఖ్య కాదని, తెలంగాణ రూపాన్ని మార్చే శక్తి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణలో 2047 నాటికి నెట్ జీరో సాధించడమే లక్ష్యమని వెల్లడించారు. ఆర్థికాభివృద్ధి, పర్యావరణం ఒకదానికొకటి విరుద్ధం కాదని.. ఇకపై ఇవి పరస్పర సహకారాలు అని చెప్పారు. సోమవారం తెలం గాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు.
తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మూసివేసిన గదుల్లో రాసిన పత్రం కాదని.. ప్రముఖుల సలహాలు, నిపుణుల చర్చలు, పౌరుల అభిప్రాయాలతో కింది నుంచి పైకి వచ్చిన ప్రజాస్వామ్య ప్రక్రియ అని.. అందుకే ఇది ప్రభుత్వపు పత్రం మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల పత్రం అని వివరించారు. దూరదృష్టి ఒక ఏడాది కోసం కాదని.. 2047 వరకూ ఉన్న దీర్ఘకాల లక్ష్యం తో నిర్మించిన విజన్ అని చెప్పారు.
తమ విజన్ నాలుగు స్తంభాలపై నిలబడి ఉన్నదని.. అందులో మొదటిది మూడు ట్రిలి యన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని తెలిపారు. ఇది కేవలం నినాదం కాదని, అన్ని రంగాలవారీగా, జిల్లాలవారీగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అని వివరించారు. స్పేషియల్ ప్లానింగ్‌కు కొత్త వ్యాకరణం క్యూర్, ప్యూర్, రేర్ అని.. సమగ్ర అంచనాలకు కట్టుబాటు అని తెలిపారు. సస్టున బిలిటీనీ ఆవిష్కరణాత్మకంగా సహకారం చేయడం అని చెప్పారు.
ప్రపంచంతో తెలంగాణ పోటీ: డీకే శివకుమార్
అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. రెండేళ్ల ప్రభుత్వ పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు తెలంగాణ సీఎంతోపాటు క్యాబినే ట్‌ను అభినందించారు. బెంగళూరు, హైదరాబాద్ నగరాలు కలిసి ప్రపంచంతో పోటీ పడుతున్నాయని వ్యాఖ్యానించారు.
తర్వాత తరానికి ఏమి కావాలో ఈ ప్రభుత్వం ఆలోచించిందని తెలిపారు. తెలంగాణతోపాటు సౌత్ ఇండియా అభివృద్ధికి కర్ణాటక సహకరిస్తుందని హామీ ఇచ్చారు. దేశ ఐటీ ఎగుమ తుల్లో బెంగళూరు 40 శాతం కలిగి ఉందని, చిన్న రాష్ర్టమైనప్పటికీ తెలంగాణ గొప్ప వాటా కలిగి ఉందని కొనియాడారు.
విశ్వవిద్యా కేంద్రంగా తెలంగాణ: మంత్రి దామోదర్ రాజనర్సింహ
తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టంచేశారు. రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను మూ డు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంలో వైద్య, విద్యారంగాలే వెన్నముకగా నిలుస్తాయని అన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ‘తెలంగాణ యాజ్ ఏ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్’ అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో మంత్రి ప్రసంగించారు. బాలికా విద్య ప్రాముఖ్యతపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నర్సింగ్ వంటి వృత్తి విద్యా కో ర్సులు ఎంతో దోహదపడతాయి. వారి కలలను సాకారం చేసేందుకే తెలంగాణ ప్రభు త్వం గతేడాది కొత్తగా 16 నర్సింగ్ కళాశాలలను ప్రారంభించింది. కేవలం డిగ్రీలు ఇవ్వడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో వారికి ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం. ఇందుకోసం నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, జపనీస్, ఇంగ్లిష్ భాషల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తు న్నాం.
తద్వారా మన ఆడబిడ్డలు విదేశాల్లోనూ రాణించేలా తీర్చిదిద్దుతున్నాం. రా ష్ర్టంలో ప్రస్తుతం 47 విశ్వవిద్యాలయాలు, 1,951 ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక కళాశాల సాంద్రత కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య ను అందించేందుకు యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల కోసం యంగ్ ఇండి యా స్కిల్ వర్సిటీని నెలకొల్పాం’ అని వివరించారు.