ఉత్తమ ఉద్యోగి రాజయ్యకు సన్మానం
సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంజన్ గౌడ్
కోదాడ ఆగస్టు 16, (విజయక్రాంతి): ఉత్తమ ఉద్యోగిగా ప్రశంస పత్రం అందుకున్న చలిగంటి రాజయ్యకు సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చలిగంటి రాజయ్యకు ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగిగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం అభినందనీయమన్నారు.
విధి నిర్వహణలో అంకితభావం, ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం రావడం మన 30వ వార్డు నివాసులకు చాలా సంతోషంగా ఉందన్నారు. పూలమాల శాలువా తో ఘనంగా సన్మానించారు. రాజయ్య మాట్లాడుతూ ఈ విధంగా ప్రశంసాపత్రం అందుకోవడం రెండోసారి అని తెలియజేశారు. నా సేవలకు గుర్తించి ప్రశంసా పత్రం అందించిన జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నాకు ప్రోత్సాహంగా సన్మానం చేసిన అంజన్న గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చలిగంటి ప్రసాద్ భూమా శ్రీనివాస్ సట్టు యల్లయ్య బాడిష రమేష్ సత్తార్ ఉల్లెందుల సతీష్ ఆలవెల్లి రమణ భూక్యా వెంకటేష్తోపాటు 30 వార్డు సభ్యులు, అంజన్న ఆర్మీ, తదితరులు పాల్గొన్నారు.






