calender_icon.png 23 July, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొడ్డిదారిన బూడిద వ్యాపారం?

23-07-2025 12:00:00 AM

  1. జాతీయ రహదారి రోడ్ల పేరుతో అక్రమ రవాణా ?

పూర్తయిన జాతీయ రహదారికి బూడిద సరఫరా?

భద్రాద్రి కొత్తగూడెం, జులై 22, (విజయక్రాంతి):రాజ్యం మనదే... మనకు అడ్డేది... చట్టాలు, నిబంధనలు జాంతానై అన్నట్లు ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెన్కో అధికారులు, కొంతమంది అధికార పార్టీ నేతల తీరు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5 6 7 దశల బూడిద వాగు నుంచి జాతీయ రహదారుల పేరుతో అక్రమంగా బూడిద రవాణా చేస్తున్నట్లు ఆరోప ణలు వెలబ డుతున్నాయి.

ఇప్పటికే బూడిద అక్రమ రవాణాపై చోటు చేసుకున్న వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉంది. తీర్పు వెలబడకపోవడం తో అక్రమార్కులు దొడ్డిదారీని ఎంచుకున్నారు. వారికి విద్యుత్ సౌధాలోని డైరెక్టర్ స్థాయి అధికారులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలు మెండుగా ఉన్నాయనే విమర్శలు వెలబడుతున్నాయి. 2024_ 25 సంవత్సరంలో బూడిద చెరువు కింద నష్టపోతున్న గిరిజన గ్రామాన్ని కాదని, గ్రీన్ ఫీల్ హైవే అనే ఒక కార్పొరేట్ కంపెనీకి టెండర్ను అక్రమంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రీన్‌ఫీల్‌హైవే ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి.

ఇప్పటికే ఈ జాతీయ రహదారి పని 95% పూర్తి అయిందనీ తెలుస్తోంది. అక్రమార్కులు జన్కో అధి కారుల నుంచి దొడ్డే ధారణ ఆర్డ ర్లు పొంది కొంత మంది బూడిద వ్యాపారాన్ని ఏదేచ్ఛగా చేస్తున్నారనీ తెలుస్తోంది. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పాల్వంచ మండల పరిధిలోనిసూ రారం, పుల్లాయగూడెం, పునుకుల, పట్టణ పరిధిలోనే కనక వాగు ప్రాంతాలను కాలు ష్య ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది.

ప్రభావిత గ్రామాల గిరిజన కాంట్రా క్టర్లు తమకు అన్యాయం జరుగుతుందని మొరపెట్టుకున్న ఆలకించిన నాధుడే లేడని వాపోతున్నారు. నష్టపోతున్న ప్రభావిత గ్రా మాల ప్రజలు జన్కో సిఎండికు ఫిర్యాదు చేశారు.

తమ నోట్లో బూడిద కొట్టి గ్రీన్ ఫీల్ హైవే పేరుతో బడా బాబులతో చేతులు కలి పి లక్షల టన్నుల బూడిదను దొడ్డి దారిన బ యటకు తరలిస్తూ కోట్లు దండుకుంటున్న అంశంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, బూడిద చెరువు కట్ట ప్రభావంతో నష్టపోతున్న గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతూ గిరిజన కాంట్రాక్టర్లు, కాలుష్య ప్ర భావిత గ్రామాల ప్రజలు జన్కో సీఎండీకి ఫిర్యాదు చేశారు.