23-07-2025 11:10:32 AM
నేరేడుచర్ల మండలం పెంచికలదిన్నె గ్రామంలో విషాదం
హుజూర్ నగర్,(నేరేడుచర్ల): విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేరేడుచర్ల మండలంలోని పెంచికల్ దిన్న గ్రామానికి చెందిన రైతు నగిరి శ్రీను(55) బుధవారం తన వ్యవసాయ బావి వద్ద కరెంటు మోటారును ఆన్ చేయడానికి వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. అటువైపుగా వెళ్తున్న రైతులు చూడగా బోరుమోటారు వద్ద విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెంది ఉన్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో ఈ విషాద ఘటన పలువురు రైతులను,గ్రామ ప్రజలను కలత వేసింది.