23-07-2025 09:05:37 AM
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ గత కొన్ని రోజులతో పోలిస్తే ఒకింత తగ్గింది. బుధవారం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్ని నిండిపోయాయి నారాయణగిరి షెడ్ల వరకు సాగింది. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) శ్రీవారికి 28,642 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.42 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.