23-07-2025 10:00:48 AM
మిర్యాలగూడ: పార్కింగ్ లో ఉన్న నైట్ హాల్ట్ బస్సుకు ఆకతాయిలు నిప్పు పెట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల్ల గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) బస్సును తగులబెట్టారు. మిర్యాలగూడ డిపోకు చెందిన టీఎస్ 05జేడ్ 0047 నంబర్ బస్సు గ్రామంలోని ప్రధాన బస్సు జంక్షన్ వద్ద రాత్రంతా ఆగి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు బస్సు వెనుక భాగానికి నిప్పంట్టించడంతో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్, కండక్టర్ల సమాచారంతో పోలీసులు, పైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మండలను అదుపు చేశారు.
బస్సు వెనుక భాగం, టైర్లతో సహా పూర్తిగా కాలిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, బస్సుకు గణనీయమైన నష్టం వాటిల్లిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దహనం వెనుక ఉన్న నిందితులను గుర్తించి పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పరిశీలిస్తున్నారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.