23-07-2025 10:59:37 AM
టీఆర్ఎస్(డీ)పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): టీఆర్ఎస్(డి) పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో బోరబండ క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాండేట్ కంచర్ల మంజూష పోస్టర్, పార్టీ మేనిఫెస్టో ను ఈనెల 25న ఆవిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 25వ తేదీన ఉదయం 11 గంటలకు పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జులు, ఉద్యోగ సంఘ నాయకులు , అనుబంధ జిల్లా అధ్యక్షులు, మండల నాయకులు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ బోరబండ క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు సకాలంలో హాజరు కాగలరని ఆయన తెలిపారు.