23-07-2025 11:16:33 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు ఏజెన్సీ ప్రాంతంలో దట్టమైన అడవిలో ఉన్న భీముని పాదం జలపాతం పాలధారలా జాలువారుతోంది. 20 అడుగుల ఎత్తు నుంచి దిగువకు దుముకుతూ ప్రవహిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు బుధవారం జలపాతం జల సవ్వడి చేస్తూ ప్రకృతి రమణీయంగా మారింది.