calender_icon.png 9 January, 2026 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల ఉగ్ర నరసింహస్వామి ఆలయ నిర్మాణానికి రూ. లక్ష విరాళం

07-01-2026 12:24:40 AM

బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకున్న సుదర్శన్ దంపతులు

మేడ్చల్ అర్బన్ జనవరి 6 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం యర్రవరం గ్రామంలో స్వయంబుగా వెలసిన బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయ నిర్మాణానికి మేడ్చల్ మండల బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యర్రవరం గ్రామంలో వెలిసిన బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయ నిర్మాణానికి సుదర్శన్ కుటుంబ సభ్యులు ఒక లక్ష రూపాయల విరాళాన్ని అందజేసినట్లు వెల్లడించారు.అదేవిధంగా ఆలయ ముందు పాండు స్వామి మంటపానికి 15000 రూపాయల విరాళాన్ని అందజేసినట్లు సుదర్శన్ స్పష్టం చేశారు.

ఆలయ అభివృద్ధిలో భాగంగా గుడి నిర్మాణంలో తన వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగిందని ఆయన చెప్పారు.సాక్షాత్తు వైకుంఠం నుండి వచ్చి ఇక్కడ వెలిశాడని సుదర్శన్ తెలియజేశారు.ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా పూజలందుకుంటున్న యర్రవరం లో వెలసిన బాల ఉగ్ర నరసింహ స్వామి ఓ బాలుడి రూపంలో వచ్చి నేను బాల ఉగ్ర నరసింహ స్వామినని చెప్పి చెరువు కట్ట వద్ద దుల్లగుట్టను తవ్వితే ఆనవాళ్లు కనిపిస్తాయని చెప్పి తవ్వితే స్వామి ప్రత్యక్షమయ్యారని సుదర్శన్ అన్నారు.కళ్ళ ముందు జరిగే సంఘటనలు చూసి ప్రజలకు నమ్మకం కలిగించారని ఆయన చెప్పారు.