07-01-2026 12:26:07 AM
సర్పంచ్ కిషన్ నాయక్
తాండూరు, 6 జనవరి (విజయక్రాంతి): గ్రామ అభివృద్ధికి సంబంధిత అధికారులు సహకరించాలని వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగాయి గుట్ట తాండ సర్పంచ్ కిషన్ నాయక్ కోరారు. మంగళవారం ఆయన గ్రామ పెద్దలు రూప్ సింగ్ నాయక్ దన్ సింగ్ నాయక్ లతో కలిసి ఎంపీడీవో శ్రీనిజ, ఎంపీఓ కరణం ఆనంద్ రావులను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కిషన్ నాయక్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు త్రాగునీరు, వీధిదీపాలు, పారిశుద్ధ్య పనులు నిరంతరం అందేలా సంబంధిత అధికారులు సహకరించాలని కోరారు.