07-01-2026 12:23:57 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి6(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల , కళాశాలలో శుక్రవారం జోనల్ స్థాయి నెట్బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొదటి స్థానం ఆసిఫాబాద్ జిల్లా, రెండవ స్థానం అదిలాబాద్ జిల్లా, మూడవ స్థానం మంచిర్యాల జిల్లా గెలుచు కున్నాయి.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది బాలురు, 12 మంది బాలి కలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎంపికైన విద్యార్థులు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో నెట్బాల్ జిల్లా అధ్యక్షుడు అలీ బిన్ అహ్మద్, జిల్లా సెక్రటరీ బి. వెంకటేశం, కళాశాల ప్రిన్సిపాల్ దుర్గం మహేశ్వర్, మల్లేష్, శ్రీ వర్ధన్ , వ్యాయామ ఉపాధ్యాయులు బి. తిరుపతి, పి.డి. అఖిల్, పి.డి. అజయ్, యోగి, అంకిలా, కవిత, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.