బాబు ఫ్యామిలీకి డబుల్ ధమాకా
08-06-2024 12:59 AM
భువనేశ్వరి, లోకేశ్ ఆస్తులు అమాంతం జంప్
న్యూఢిల్లీ, జూన్ 7: ఏపీలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అన్నీ శుభ శకునములే కనిపిస్తున్నాయి. ఏపీతోపాటు కేవలం 16 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పబోతున్న ఆయనకు ఆర్థికంగానూ భారీగా కలిసి వస్తున్నది. ఏపీలో టీడీపీ గెలువగానే చంద్రబాబు కంపెనీ హెరిటేజ్ ఫుడ్ షేర్లు ఆకాశాన్ని తాకాయి.
ఐదు రోజుల్లోనే షేర్ ధర ఏకంగా 55 శాతం పెరిగింది. దీంతో అందులో వాటాలున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సంపద ఐదురోజుల్లో ఏకంగా రూ.579 కోట్లు పెరిగింది.ఆయన కుమారుడు, ఏపీ ఎమ్మెల్యే నారా లోకేశ్ ఆస్తులు రూ.237 కోట్లు పెరిగాయి. జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర రూ.424 ఉండగా, శుక్రవారం అది రూ.661.25కు ఎగబాకింది.






