10-12-2025 01:07:12 AM
ఎల్లారెడ్డి, డిసెంబర్ 9 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది, రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది, అలాగే, ఎమ్మెల్యే మరియు మున్సిపల్ కమిషనర్ నిరంతరం పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు, నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు, దీనివల్ల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు, నిధులు..
నిధుల కేటాయింపు: కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల అభివృద్ధికి రూ.90 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి రూ.25 కోట్ల నిధులు కూడా కేటాయించారు.
మౌలిక సదుపాయాలు: రోడ్ల వెడల్పు, సెంట్రల్ లైటింగ్, స్వాగత తోరణాల నిర్మాణం వంటి పనులు జరుగుతున్నాయి.
సమీక్షలు: ఎమ్మెల్యే మదన్ మోహన్, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులతో కలిసి రూ.15 కోట్ల విలువైన పనుల పురోగతిని సమీక్షించారు, నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు.
ముఖ్య అంశాలు..
ప్రభుత్వ నిధులు, స్థానిక నాయకత్వం చొరవతో ఎల్లారెడ్డి పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పట్టణ సౌందర్యాన్ని పెంచే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని 12 వార్డుల్లో ప్రతి వార్డుల్లో తప్పనిసరిగా మృతి కాలువలు మరియు సిసి రోడ్లు, అమృత్ 2.0 నీటి సరఫరా ప్రతి ఇంటికి సరఫరా చేయడంలో ఎమ్మెల్యే మదన్మోహన్ ఎల్లారెడ్డి పురపాలక పట్టణంలో ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసి పనులను వేగవంతంగా నిర్వహించాలని మున్సిపల్, కమిషనర్ మహేష్ కుమార్ కు మున్సిపల్ ఏఈ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పనులను ఎక్కడ చూసినా అక్కడ పనులు వేగవంతంగా పూర్తి అవుతున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎల్లారెడ్డి మండలంలో ఎక్కడ చూసినా ఇండ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుంది ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పట్ల తీవ్ర సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు నిర్మాణం చేసుకుంటున్నా లబ్ధిదారులు పలువురు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నా లబ్ధిదారులు వారి పనులను బట్టి సమయానికి సంబంధిత శాఖ అధికారులు ఇంటి నిర్మాణం వద్దకు వెళ్లి ఇల్లు నిర్మాణం జరిగిన స్థాయిని బట్టి నిధులు మంజూరు చేయడంలో వేగవంతం చేస్తున్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలో ఎల్లారెడ్డి మెదక్ ప్రధాన రహదారిపై పక్కనే ఉన్న పెద్ద చెరువును మినీ ట్యాంక్ పండుగ రూపుదిద్దుకుంటున్న పెద్ద చెరువు కట్టపై, ఫుట్పాత్ మరియు పార్క్, సెంట్రల్ లైటింగ్ తో సుందరీ కారణంగా రూపుదిద్దుకుంటుంది. ప్రజలకు పెద్ద చెరువు కట్టపై జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ పనిలోపట్ల జరుగుతున్న పనులను చూసి సంబరపడుతున్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలో ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్ పై సెంట్రల్ లైటింగ్ తో ఎల్లారెడ్డి రూప్ రేఖలు మారి ప్రజలకు ఎంతో అభివృద్ధిని కనువింపు చేస్తుంది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు.
ఈ నిధులతో వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీల మరమ్మతులకు 6 కోట్లు, పెద్ద చెరువు వద్ద పార్క్ నిర్మాణానికి 3 కోట్లు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 5 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు 1 కోటి రూపాయలు కేటాయించారు.
పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని అన్నారు. ఎల్లారెడ్డి పురపాలక పట్టణం, రాష్ట్రంలోని నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అంటూ ఎమ్మెల్యే మదన్మోహన్ కొనియాడారూ. ఎక్కడా లేనివిధంగా ఎల్లారెడ్డి పురపాలక పట్టణం అభివృద్ధి చేసి చూపిస్తారని ఆయన అన్నారు.