10-12-2025 01:03:50 AM
డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్
మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 9: సోనియాగాంధీ వల్లే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మీడియాతో సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సోనియాగాంధీ తెలంగాణ ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు.
తెలంగాణ అమరుల ప్రాణత్యాగాన్ని గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను గుర్తించి, సీడబ్ల్యూసీలో చర్చించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియాగాందీకే దక్కుతుందన్నారు. సంక్షేమం. అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలే కాంగ్రెస్ పార్టీ స్థంభాలు అని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ భావాజాలాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. మతాలు, కులాల పేరు మీద రాజకీయాలు చేయడం సరికాదన్నారు. భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, డిసిసి మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు లింగం నాయక్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, ఫయాజ్, ఆవేజ్, బండి మల్లేష్, ఫక్రూ, వెంకటలక్ష్మి, రామలక్ష్మి, అబ్దుల్ హక్, ప్రవీణ్ కుమార్, ఖాదర్, షాఫైసల్, తాహేర్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.