రోడ్డు ప్రమాదంలో మామ అల్లుడు మృతి
పండగపూట రెండు గ్రామాల్లో అలుముకున్న విషాదం
బెజ్జూర్, జనవరి 14 (విజయ క్రాంతి): మండలంలోని కుంటలమాలపల్లి అందుగులగూడ ప్రధాన రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి కింద పడడంతో ఒకరు అక్కడక్కడ మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. కౌటాల మండలం ముత్తంపేట్ గ్రామానికి చెందిన రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాగా, బెజ్జూర్ మండలం దుబ్బగూడ గ్రామానికి చెందిన బోర్కుట్ శంకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ప్రమాదంలో మృతిచెందిన వారు మామ అల్లుడు కావడంతో రెండు కుటుంబాలను తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మీన్నంటాయి. దీంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ఎస్సై తెలిపారు.




