18 March, 2026 | 12:59 PM

ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవ్

15-01-2026 01:53 AM

నిర్మల్, జనవరి 14 (విజయక్రాంతి):  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్మల్ నగరం ఆధ్వర్యంలో  గార్డెన్ లో సంక్రాంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన వక్త గంట తిరుమల్  మాట్లాడుతూ .. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుందని, భోగి మంటలలో మనం కాల్చాల్సింది పనికిరాని వస్తువులు కాదు, పనికిరాని ఆలోచనలు, అలవాట్లు, లక్షణాలు అని చెప్పారు.

ముఖ్య అతిథి శక్కెర పద్మనాభ గౌడ్ మాట్లాడుతూ ఏ సంస్థ కూడా ప్రారంభం అయి శత జయంతి ఉత్సవాలు జరుపలేదని. కానీ దేశం కోసం, ధర్మం కోసం, సమాజ సేవ కోసం పనిచేస్తున్న సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీ శక్కెర పద్మనాభ గౌడ్ టీఆర్‌ఎస్‌ఎంఏ పట్టణ ప్రధాన కార్యదర్శి, జిల్లా సంఘచాలక్ నూకల విజయ్ కుమార్, మంచిరాల నాగభూషణ్, అశోక్, కిన్నెర్ల రవి, చుక్క సాయి కృష్ణ, నరేష్, అనిల్, గణేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.