calender_icon.png 15 January, 2026 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్ధిలో సర్పంచులే కీలకం

15-01-2026 01:50:29 AM

కుబీర్, జనవరి ౧4 (విజయక్రాంతి): గ్రామాభివృద్ధిలో సర్పంచులే కీలకమని ముథోల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, జిడిఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ అన్నారు. బైంసా డివిజన్ కేంద్రంలో బుధవారం ఆరే మరాఠా  ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలిచే వరకే పార్టీలు. గెలిచిన తర్వాత పార్టీ భేదాలను విస్మరించి, అందరినీ కలుపుకొని ముం దుకు వెళ్లి అందరి మన్ననలు పొందినప్పుడే సర్పంచులకు మంచి పేరు వస్తుందని సూచించారు. ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో అమెవా అధ్యక్షులు ఎల్ ప్రదీప్ పాటిల్, ప్రధాన కార్యదర్శి కే. బాబురావు పాటిల్ మీడియా ప్రతినిధి జాదవ్ శ్రీకాంత్ పాటిల్,  బైంసా ఆరె మరాఠా సంఘం గౌరవ అధ్యక్షులు జాధవ్ పుండలిక్ రావు పాటిల్, అమేవా సభ్యులు పాల్గొన్నారు.