19-12-2025 01:54:32 AM
శంషాబాద్‌లోని ఫ్లైఓవర్ కింద జీవనం సాగిస్తున్న డప్పు మల్లయ్య
ఆశ్రమానికి తరలించిన పోలీసులు
రాజేంద్రనగర్, డిసెంబర్ 18 (విజయక్రాం తి): ఆస్తులు తమ పేర రాసుకొని, ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఓ తండ్రి అనాథలా అసలే ఎముకలు కొరికే చలిలో ఫ్లైఓవర్ కింద ఆకలితో అలమటిస్తూ బతుకుతున్నాడు. కొం త కాలంగా శంషాబాద్‌లోని ఫ్లై ఓవర్ కింద జీవనం సాగిస్తున్న డప్పు మల్లయ్య జీవితం గాథ వింటే మనస్సు తరుక్కుపోతుంది. గురువారం అటునుంచి వచ్చి పోయే వారిని చేతు లు చాచి అడుక్కుంటుంటే శంషాబాద్ పోలీసులు గమనించి అతన్ని చేరదీసి అనాధాశ రణాలయానికి తరలించారు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన డబ్బు మల్లయ్యకు ఇద్దరు కుమారు లు గణేష్, శివ, కూతురు సునీత ఉన్నారు. 30 ఏళ్ల క్రితం పిల్లలతో కలిసి బతుకుతెరువు కోసం శంషాబాద్ సమీపంలోని రాళ్లగూడకు వచ్చిన మల్లయ్య దంపతులు.. భార్యాభర్తలిద్దరూ కాయ కష్ట చేసి పిల్లలను చదివించారు. అక్కడే ఓ ఇంటిని నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు చేశారు.
ఈ క్రమంలో కరోనా సమయంలో మల్లయ్య భార్య యాదమ్మ మృతి చెందడంతో కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆరు నెలల క్రితం మల్లయ్యకు రోడ్డు ప్రమాదంలో గాయపడి నడ వలేని స్థితిలోకి చేరుకున్నాడు. పిల్లలు చేరదీయకపోవడంతో గత్యంతరం లేక శంషాబాద్ నుంచి రాళ్లగూడ వైపు వెళ్లే మార్గంలోని ఔటర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ కింద అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు.
గురువారం శంషాబాద్ పోలీసులు ఆయన పరిస్థితిని గమనించి దగ్గరికి వెళ్లి ఆరా తీశారు. ఇద్దరు కుమారుల్లో ఒకరు డ్రైవరుగా, మరొకరు సెంట్రింగ్ పని చేస్తారని చెప్పాడు. తాను సంపాదించిన ఆస్తి తీసుకుని, తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో ఇలా అడుక్కుతింటున్నానని చెప్పాడు. అనంతరం అతన్ని పోలీసులు అనాథ శరణాలయానికి తరలించారు.