19-12-2025 01:53:34 AM
కొత్తపల్లి, డిసెంబర్18(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈనెల 27న మెగా ఉద్యోగ మేళా నిర్వ హిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య యు. ఉమేశ్ కుమార్ తెలిపారు. శాతవాహన వర్సిటీ-నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 27న ఉదయం 9 గంటలకు వర్సిటీ ఆవరణలో ఉద్యోగ మేళా ప్రారంభం కానుందన్నారు.
ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఫార్మసీ, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్‌ఎంసీజీ, మేనేజ్మెంట్ వంటి 50కిపైగా కార్పొరేట్ కంపెనీల్లో 5000 వేలకు పైగా ఉద్యోగాల్లో నియామకాలు ఉంటాయని డిగ్రీ, పీజీ, బి టెక్, ఎం టెక్, బి కాం, ఎం కాం, కంప్యూటర్ సైన్స్ తదితర కోర్స్ లలొ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు వినియోగించుకోవాలని జాబ్ మేళా కు రిజిస్ట్రేషన్ ఉచితమని పేర్కొన్నారు.