రేపు హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయం మూసివేత
02-03-2026 09:17 PM
మంగపేట,(విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూసివేయనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్. మహేష్ సోమవారం తెలిపారు. మంగళవారం ఉదయం స్వామి వారికి నిత్య పూజా కార్యక్రమలు నిర్వహించి ఉదయం 8.30 గంటలకు ఆలయ ద్వార బంధనం (మూసివేయడం) జరుగుతుందని, బుధవారం ఉదయం సంప్రదాయబద్ధంగా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఉదయం 8.30 నుండి భక్తులకు దర్శనం కల్పించబడునని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్. మహేష్ తెలిపారు.




