19-12-2025 01:56:04 AM
చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి సవాల్
కుషాయిగూడ, డిసెంబర్ 1౮ (విజయక్రాంతి): తాను చేస్తున్న అభివృద్ధి చూడలేక బీఆర్‌ఎస్ నాయకుడు సోమశేఖర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. తాను ఎవరి దగ్గర ఒక రూపాయి లంచం తీసుకోలేదని.. తీసుకున్నానని నిరూపించాలని సింగి రెడ్డి సోమశేఖర్‌రెడ్డికి బొంతు శ్రీదేవి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే తాను జీహెచ్‌ఎంసి నుండి అత్యధికంగా కోట్లాది రూపాయల నిధులు తెప్పించి చెర్లపల్లి డివిజన్లో మురికివాడలను రోడ్లను డ్రైనేజీ అన్ని రంగాలలో సుందరీకరణగా తీర్చిదిద్దానని ఆమె తెలిపారు.
సోమశేఖర్ రెడ్డి ఆరోపణలు నిరూపించాలని.. నిరూపించకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొంతమంది బొం తు కుటుంబంపై కుట్రలు కుయుత్తులు పన్నుతున్నారని ఆరోపించారు. మహిళ అని చూడ కుండా కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని నాపై సోషల్ మీడియాలో దుర్మార్గంగా ప్రచా రం చేస్తున్నారని, వారికి త్వరలోనే బుద్ధి చెప్తానని ఆమె హెచ్చరించారు.