calender_icon.png 21 January, 2026 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియా పోరుకు సై

21-01-2026 12:00:00 AM

బరిలో ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు

చైర్మన్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేతలు

గెలుపు గుర్రాల కోసం అన్వేషణ

జిల్లాలో ఏకైక బల్దియాలో ఆసక్తిగా మారిన పోరు

ఆదిలాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల కు సమరం సిద్ధమవుతోంది. జిల్లా లో ఉన్న ఏకైక ఆదిలాబాద్ మున్సిపాల్టీ లో గెలుపు కోసం ఆయా రాజకీయ  పార్టీలు సై అంటే సై అంటున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఛైర్మె న్ పదవి జనరల్ మహిళాకు రిజర్వ్ కాగా, వార్డుల వారీగా ప్రభుత్వం రిజర్వేషన్ లు ఖరారు చేయడంతో ఇక ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడమే ఆలస్యం. నోటిఫికేషన్ వెలువరించిన వెంటనే పుర సమరం ఆరంభం కానుంది. మరోవైపు ప్ర ధాన రాజకీయ పార్టీలు బల్దియా ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి.

కదనరంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బరిలో నిలిపే అభ్యర్థుల కోసం సర్వేలు ప్రారంభించగా, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు సైతం గెలు పు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అన్ని పార్టీలు సైతం ఆయా వార్డుల వారీగా బలమైన అభ్యర్థుల కోసం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల తరపున పోటీ చేసేందుకు అనేక మంది ఆశావహులు ఆసక్తి కనబరుస్తున్నా గెలుపు అవకాశం ఉన్న వారినే ఎంపిక చేయాలని ఆ పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు పలుమార్లు సమీక్ష సమావేశాలు సైతం నిర్వహించారు. 

గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహలు..

ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక ఆదిలాబాద్ మున్సిపాల్టీ లో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎక్కువ శాతం స్లమ్ వార్డులు ఉండటంతో, ఎక్కువ వార్డులను గెలుచుకొని ఛైర్మెన్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా ఆయా పార్టీలు వ్యూహలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు బీజేపీ కైవసం చేసుకోగా,  అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ లో మాత్రం మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోని బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అభ్యర్థుల విజయావకాశాలపై సర్వేలు చేయిస్తోం ది. ఇందుకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కార్యాచరణ రచిస్తోంది.

ఇక గత ఎన్నికల వరకు ఉమ్మడి జిల్లాలో తిరుగులేని శక్తిగా ఉన్న బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తరవాత కొంత ఢీలా పడింది. ముఖ్య నాయకులు కొందరు పార్టీ మారా రు. కానీ క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉండటంతో రానున్న ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. గెలిచే అవకాశం కలిగిన వారికి టికెట్లు కేటాయిం చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పలు రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్నాయి. ఎం.ఐ.ఎం, కమ్మ్యూనిస్టు పార్టీలు సైతం బలం ఉన్న వార్డుల్లో బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు అనేకమంది మంది స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

నోటిఫికేషన్ కోసం అతృతగా..

ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్ లు ప్రకటించడంతో అందరి చూపు నోటిఫికేషన్ మీదనే పడింది. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యో అవకాశం ఉండ టం.. వెంటనే నామినేషన్‌లు సైతం స్వీకరిం చే అవకాశం ఉండటంతో ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు అన్ని పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు అవసరమైన వాటిని ముందస్తుగానే సిద్ధం చేసుకుంటున్నారు. ఆ యా తహసీల్దార్ కార్యాలయాల్లో కౌన్సిలర్ అభ్యర్థుల సందడి కనిపిస్తోంది. కొందరు అభ్యర్థులు ఇది వరకే ఆయా పత్రాలు తీసి సిద్ధం చేసుకున్నప్పటికీ రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో నిరాశకు  గురైయ్యారు.