13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

హనుమాన్ జయంతికి గ్లింప్స్

28-03-2026 02:17 AM

2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. నితేశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాస చిత్రబృందం తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చింది. రామ నవమి సందర్భంగా నిర్మాత నమిత్ మల్హోత్రా తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. “ఇది మనందరికీ చెందిన కథ. మన ‘రామాయణం’ను అత్యంత చిత్తశుద్ధితో తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.

ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి’ సందర్భంగా మా నెక్స్ గ్లింప్స్ ‘రామ’ను విడుదల చేస్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముని పాత్రలో నటిస్తుండగా సాయిపల్లవి సీతగా, యష్ రావణునిగా, సన్నీ డియోల్ హనుమంతునిగా, రవి దూబే లక్ష్మణునిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.