14 July, 2026 | 4:42 AM

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో మంథనిలో నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం

14-07-2026 12:00 AM

ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణకు శ్రీకారం

మంథని జులై 13 (విజయ క్రాంతి) మంథని నియోజకవర్గ యువతకు పోలీ సు ఉద్యోగాల సాధనలో అండగా నిలిచే మరో కీలక కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శ్రీకారం చుట్టారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో, శ్రీ విశ్వ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది.ఈ శిక్షణ కార్యక్రమం జూలై 15 నుంచి ప్రా రంభం కానుండగా, మంథని నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

మంత్రి శ్రీధర్ బాబు నాయక త్వంలో మంథని నియోజకవర్గంలో విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. యువత ఉద్యోగాల సాధనలో ముందుకు సాగేందుకు ఇలాంటి ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. శిక్షణలో రాత పరీక్షతో పాటు ఫిజికల్ ట్రైనింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, రోజువారీ టెస్టులు, గ్రౌండ్ ప్రాక్టీస్ వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న యువత ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకొని తమ లక్ష్యాన్ని సాధించాలని కోరారు.