calender_icon.png 23 May, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట...

03-05-2025 09:07:28 PM

ఎమ్మెల్యే బొజ్జు పటేల్..

ఉట్నూర్ (విజయక్రాంతి): రైతుల సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bojju Patel) పేర్కొన్నారు. శనివారం ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట గ్రామంలో శిరిడి సాయిబాబు మహిళ సమాఖ్య భూపేట, బిర్సాయిపేట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. నేడు మహిళ సంఘాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అప్పగించామని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు.