19 March, 2026 | 5:01 AM

ఘనంగా దుర్గాదేవి జాతర

22-07-2024 01:39 AM

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పీఎస్‌ఆర్, ప్రముఖులు

మంచిర్యాల, జూలై 21 (విజయక్రాంతి): మంచిర్యాల సమీపంలోని ర్యాలీ గడ్‌పూర్‌కు వెళ్లే అటవీ దారిలో కొలువైన క్వారీ దుర్గాదేవి ఆలయ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి పోటెత్తారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురే ఖ, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు దంపతులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తమ వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారికి కోళ్లు, మేకలు బలి ఇచ్చారు. వన భోజనాలు చేశారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహిం చారు. రోజంతా ముసురుతో కూడి న వర్షం కురిసినప్పటికీ భక్తులు అధిక సం ఖ్య లో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.