11 July, 2026 | 9:38 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

పదవి విరమణ పొందిన ఉద్యోగులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు

30-06-2025 05:16 PM

ములుగు (విజయక్రాంతి): పోలీస్ డిపార్ట్మెంట్లో తమ సర్వీస్ పూర్తి చేసుకుని ఈరోజు పదవీ విరమణ చేసిన ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐ ఎం.రవీందర్, ఎన్.కనకయ్య, ఏఆర్ఎస్ఐ కె.సుబ్బరాయుడు, సీసీఎస్ నందు విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఏ.రామకిష్టయ్య, పిసిఆర్ నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్  సిహెచ్ చుక్కయ్యకు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో ములుగు జిల్లా ఎస్పీ శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.శబరిష్.పి ఐపీఎస్ (District SP Dr. Shabarish.P IPS) మాట్లాడుతూ... ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐ ఎం.రవీందర్, ఎన్.కనకయ్య, ఏఆర్ఎస్ఐ కె.సుబ్బరాయుడు, సీసీఎస్ నందు విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఏ.రామకిష్టయ్య, పిసిఆర్ నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ చుక్కయ్యలు పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా సేవలందించి సర్వీస్ పూర్తి చేసుకుని ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారని శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ విభాగంలో సుధీర్ఘ కాలంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన సిబ్బంది సేవను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు పోలీస్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని అన్నారు పోలీసు రిటైర్ మెంట్ కేవలం వారి వృత్తికే, కాని వారి వ్యక్తిత్వానికి కాదని కొనియాడారు.

విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా, పిల్లలకు దూరంగా ఉండి విధులు నిర్వహించారు. పదవి విరమణ చేసిన పోలీసులు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ములుగు డి.ఎస్.పి రవీందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శంకర్, ఆర్ఐ లు స్వామి, సంతోష్, తిరుపతి, పదవి విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది పాల్గొన్నారు.