10 May, 2026 | 10:37 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

బీజేపీకి బిగ్ షాక్.. రాజాసింగ్ రాజీనామా

30-06-2025 05:17 PM

హైదరాబాద్: భారతీయ జానత పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన సోమవారం బీజేపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రాజాసింగ్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా కొందరు నేతలు తనను అడ్డుకున్నారని ఆరోపించారు. నామినేషన్ పత్రాలపై సంతకం చేయనివ్వలేదని, తన అనుచరులను,  జాతీయ కౌన్సిల్ సభ్యులు మద్దతు ఇవ్వకుండా బెదిరించారని వాపోయ్యారు. పార్టీలో ఉంటారా సస్పెండ్ చేయాలా అని బెదిరించారని, తన విషయంలో లక్షలాది మంది కార్యకర్తులు బాధపడుతున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. దీంతో ఆయన రాజీనామా లేఖను తనే స్వయంగా కిషన్ రెడ్డికి ఇచ్చినట్లు వెల్లడించారు. 

రామచందర్ రావుకు అధ్యక్ష పదవి కట్టబెడుతుండటంపై కార్యకర్తలో అసంతృప్తి ఉందన్నారు. 2014 నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. పార్టీలో ఉన్నానని చెప్పారు. రాజాసింగ్ తో పాటు తన కుటుంబం ఉగ్రవాదులకు లక్ష్యంగా ఉందని, అయినప్పటికి పార్టీని వీడకుండా కష్టపడి పని చేశానన్నారు. మీకూ దండం.. మీ పార్టీకో దండం అని సంచలన వ్యాఖ్యాలు చేశారు. దీంతో తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపాలని కిషన్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. తాను బీజేపీకి దూరమైన సరే హిందుత్వ అజెండా, హిందూ ధర్మాన్ని వదలబోనని రాజాసింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న.. సరైన న్యాయకత్వం లేదన్నారు. బీజేపీకి రాజీనామా చేయడం కఠిన నిర్ణయమే అయినప్పటికి తప్పట్లేదని, రాజాసింగ్ ఇకపై బీజేపీ ఎమ్మెల్యే కాదని చెప్పారు.