calender_icon.png 28 July, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా 'అరుణోదయ' విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

27-07-2025 10:21:08 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని అరుణోదయ ఉన్నత పాఠశాల 1999–2020 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మండలంలోని అందుగులపేట శివసాయి ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్యఅతిథులుగా సౌత్, వెస్ట్ జోన్ హైదరాబాద్ సిటీ పోలీస్ డిసిపి జి చంద్రమోహన్(DCP G Chandramohan), పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి(CI Shashidhar Reddy)లు హాజరయ్యారు. 25 సంవత్సరాల విరామం అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి బాల్య మిత్రులందరూ ఒక్క చోట చేరి సందడి చేశారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యా బుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో కలుసుకొని అలనాటి జ్ఞాపకాలతో ఆత్మీయంగా పలకరించుకొని, గత స్మృతులను, పాఠశాలలో చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకొని సందడి చేశారు. సుదీర్ఘ విరామం అనంతరం పూర్వ విద్యా ర్థుల ఆత్మీయ సమ్మేళనంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పి తమ జీవితాలను మలుపు తిప్పిన గురువులను  ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక వేడుకలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.