మావోయిస్టుల వారోత్సవాలలో తనిఖీలు
కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్
కన్నాయిగూడెం, (విజయక్రాంతి): మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో కన్నాయిగూడెం(Kannaigudem) ఎస్ఐ ఈ వెంకటేష్ ఆద్వర్యంలో గుట్టల గంగారం, తూపాకులగూడెం బ్యారేజి వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీ చేసారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి వాహనాన్ని తనిఖీ చెస్తూ. అలాగే గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ముఖ్యంగా జిల్లా సరిహద్దు, అటవీ సమీప ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసి, మారుమూల గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని,ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఆగష్టు మూడవ తారీఖు వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. తనిఖీలను ముమ్మరం చేశారు. చత్తీస్‌గఢ్ నుండి కన్నాయిగూడెం వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేసీ అనుమానాస్పద వ్యక్తులను విచారించి వదిలేశారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించమని తెలిపారు.




