9 July, 2026 | 7:36 PM

ఉత్తమ ప్రధానోపాధ్యాయుడికి ఘన సన్మానం

12-09-2025 12:00 AM

యాచారం  సెప్టెంబర్ 11  : రంగారెడ్డి జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపికైన యాచారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కె.నరసింహను స్థానిక పాఠశాల అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ. 

విద్యార్థులకు  ఆయన చేసిన సేవలను పాఠశాల అధ్యాపక బృందం కొనియాడుతూ. వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధత అతన్ని ఈ స్థాయికి చేర్చాయి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులుఆనంద్ , జోసెఫ్,గోవర్ధన చారి, గోపాల్, జగదీష్ కుమార్, వెంకట్ రెడ్డి, విజయకుమారి, నీరజ, మమత, పాల్గొన్నారు.