calender_icon.png 12 September, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మజీద్‌పూర్ పాఠశాలను సందర్శించిన ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్

12-09-2025 12:00:00 AM

అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 11: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్‌పూర్ ప్రభుత్వ పాఠశాలను ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్ పద్మా యాదవ్ గురువారం దర్శించారు. ఈ సందర్శనలో భాగంగా పాఠశాలలో జరుగుతున్నఫౌండేషనల్ లిటరసీ & న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమాన్ని సమీక్షించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిర్వహించే కార్యక్రమాల అమలు విధానాన్ని విశ్లేషించారు.

ప్రత్యేకంగా10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, అనుభవాలు తెలుసుకున్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న విద్యా బోధన ప్రమాణాలు, శిక్షణ పద్దతులు అన్నీకార్పొరేట్ స్థాయిలో ఉన్నాయంటూ పద్మా యాదవ్ ప్రశంచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ ఫ్యాకల్టీ సభ్యుడు జె. శ్రీనివాసులు, ఎంఈవో జగదీశ్వర్, హెచ్‌ఎం.విజయ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిండ్రులు తదితరులున్నారు.