12-09-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 11(విజయక్రాంతి) జిల్లాలోఅర్హులకు చేయూత ఫించన్ పథకం. లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. అన్నారు.పి.పి.టి. ద్వారా డైరెక్టర్ సెర్ప్ గోపాల్ అధికారులకు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. చేయూత పథకం కింద వృద్ధులకు, దివ్యాంగులకు, హెచ్‌ఐవి వ్యాధి గ్రస్తులకు, వితంతువులకు, నేతన్నలకు, గీత కార్మికులు, బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, బీడి టేకేదార్లు, డయాలసిస్, ఫిలేరియా పెషెంట్లకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని అన్నారు.
ప్రస్తుతం. వృద్ధుల పింఛన్ తీసుకుంటున్న వారు మరణిస్తే వారి స్థానంలో జీవిత భాగస్వామికి పెన్షన్ మంజూరు చేయడం, హెచ్.ఐ.వి, డయాలసిస్ పింఛన్ పోర్టల్ ఓపెన్ ఉందని అన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు పెన్షన్ సంబంధించి రెండు రిజిస్టర్లు మెయింటెన్ చేయాలని ఒక రిజిస్టర్ లో మంజూరు చేసిన ఫించన్ దారుల వివరాలు,
మరో రి జిస్టర్ లో అర్హత ఉన్న లబ్ధిదారుల వివరాలు రాయాలని, ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తే నూ తన పెన్షన్లు మంజూరు చేయాలని అన్నారు.ఈ సమావేశంలో డైరెక్టర్ సెర్ప్ గోపాల్, జిల్లా గ్రా మీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శుల, వార్డ్ ఆఫీసర్లు పోస్టల్ సిబ్బంది సెక్షన్ అసిస్టెంట్లు,తదితరులు పాల్గోన్నారు.