15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జిల్లా కలెక్టర్ కు ఘన సన్మానం

25-10-2025 06:43 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఇటీవల జిల్లా కలెక్టర్ జాతీయస్థాయిలో నీతియోగ్ జల్ శక్తి విభాగంలో గుర్తింపు పొంది కేంద్ర మంత్రితో అవార్డు తీసుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వారిని ఈ రోజు ఘనంగా సన్మానించారు. వారు జలశక్తి కార్యక్రమంతో పాటు బాలశక్తి అనే విద్యార్థుల కోసం నిర్మల్ జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ వారిని ప్రత్యేక గుర్తింపునిచ్చి వారికి గౌరవించింది. ఈ సందర్భంగా ఈ అంశాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వారిని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ జిల్లా నాయకులు తుంగూర వెంకట రాజ్యం, జాడి శ్రీనివాస్ శాంతపూరి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.