12 May, 2026 | 11:06 AM

Breaking News

సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •  

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి జన్మభూమి రుణం తీర్చుకుంటా

07-12-2025 07:19 PM

తాండూరు (విజయక్రాంతి): కత్తెర గుర్తుకు ఓటేసి గ్రామ పంచాయతీకి పంపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి జన్మభూమి రుణం తీర్చుకుంటానని వికారాబాద్ జిల్లా యాలాల మండలం నాగసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నరేష్ అన్నారు. ఆదివారం ఆయన పార్టీ నాయకులు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నరేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందించే నిధులతో గ్రామం అభివృద్ధి చేసి తాండూర్ నియోజకవర్గంలో ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఇక నరేష్ విద్యావంతుడు కావడం, గ్రామంలో చిన్న.. పెద్ద అందరితో కలిసిమెలిసి ఉంటుండడంతో ప్రత్యర్థుల అంచనాలకు మించి విజయం వైపు... బంపర్ మెజార్టీయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.