7 March, 2026 | 3:17 PM

Breaking News

ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి   •   వేం నరేందర్ రెడ్డిని సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి   •   అల్లాడిపోతున్న జనం.. 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు   •   ఎల్‌పీజీ ధరల పెంపు.. నిరసనకు మమత పిలుపు   •   కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్   •   మల్లన్నసాగర్ 3ఆర్ కాలువ పూర్తి చేయాలి   •   బాబు బడికి పోలేదా...? విద్యార్థిని పలకరించిన కలెక్టర్   •   రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి   •   ప్రైవేట్ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు   •   మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నాం   •  

వైభవంగా కన్నె పూజ.. భారీగా హాజరైన చిన్నారి బాలికలు

02-10-2025 02:17 AM

తాండూరు, అక్టోబర్ 1 ( విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రం శ్రీ హనుమాన్ దేవాలయంలో శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిన్నారి బాలికలకు కన్నె పూజను విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్దళ్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు గురాచారి జోషి చేసిన మంత్రోచ్ఛారణల మధ్య చిన్నారుల కు పాదపూజ నిర్వహించి కానుకలు అందించారు.

ఈ సందర్భంగా వేద పండితులు గురాచారి జోషి మాట్లాడుతూ చిన్నారులు కల్మషం లేని దైవంశ సంభూతులని వారిలో దుర్గామాతను కొలిచే విధంగా చూడాలని అన్నారు.అనంతరం తీర్థప్రసాదాలు వితరణ చేశారు .ఇంకా ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.