02-10-2025 02:16:31 AM
సూరమోని సత్యనారాయణ
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 1: భగవద్గీత అందరూ చదవాలని సూరమోని సత్యనారాయణ సాగర్ అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంలోని ఈశ్వర్ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులకు హిందూ ఆధ్యాత్మిక భవద్గీత పుస్తకాలను సత్యనారాయణ సాగర్ తండ్రిగారైన స్వర్గీయ కీర్తిశేషులు సురమోని బాబు సాగర్ జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ సాగర్ మాట్లాడుతూ.. భగవద్గీత పంపిణీ ప్రతి హిందువు ఇంట్లో ఈ గ్రంథం ఉండాలనే ఉద్దేశంతో, గీత సారాంశాన్ని ప్రతి ఒక్కరు నేర్చుకొని సన్మార్గంలో పయనించాలని అని చెప్పారు. భగవద్గీత పాఠ్యగ్రంధం ఎవరికైనా అవసరం ఉన్న పంపిణీ చేస్తామని గీతా సారాంశాన్ని విశ్వవ్యాప్తం చేయాలని సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి అరుణ్, ఆలయ కమిటీ సభ్యులు సూరంపల్లి కాళిదాసు సాగర్, తాళ్ల వెంకటేష్ గౌడ్, సూరంపల్లి హరిదాస్ సాగర్, భద్రప్ప, బీజేవైఎం జిల్లా నాయకులు రూపక్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.