మంచిరేవుల ఫారెస్ట్ పార్కులో నేచర్ క్యాంప్
నేడు సాయంత్రం ప్రారంభం..
విద్యార్థులకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రాజేంద్ర నగర్ ఆగస్టు 14 (విజయక్రాంతి): సార్వత్రిక సెలవుల్లో విద్యార్థులకు ప్రకృతితో మమేకమయ్యేలా నేచర్ క్యాంప్ నిర్వహించేందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15న మంచి రేవుల లోని ఫారెస్ట్ ట్రాక్ పార్క్లో నేచర్ క్యాంప్ నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమై ఆదివారం ఉదయం 10 గంటల వరకు క్యాంప్ కొనసాగుతుంది.
క్యాంప్లో టీమ్ బిల్డింగ్, టెంట్ పిచింగ్, రాక్ క్లైంబింగ్, నైట్ క్యాంపింగ్, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పాల్గొనే వారికి స్నాక్స్, రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం అందించనున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ క్యాంప్లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. 6 నుంచి 12 ఏళ్ల వయసున్న వారికి రూ.1,199, 13 ఏళ్లు పైబడిన వారికి రూ.1,999 చార్జీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలు www.deccanwoodsandtrails.comలో తెలుసుకోవచ్చని, 94935 49399, 98852 98980, 92475 86287 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..
ఫారెస్ట్ అధికారులు ట్రెక్ పార్కులో ఏర్పాటు చేసిన నేచర్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలి అడవుల ప్రాధాన్యత జీవ వైవిధ్యంపై తరగతి గదిలో కాకుండ క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించవచ్చునని ట్రెక్ పార్క్ మార్నింగ్ వాకర్ అల రవీందర్ రెడ్డి తెలిపారు
- అల రవీందర్ రెడ్డి..
మార్నింగ్ వాకర్






