18-04-2025 01:23:07 AM
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాం తి): రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణపొం దిన శాస్త్రీయ నృత్య దిగ్గజం పి. రామాంజనేయులు ఏప్రిల్ 15న తిరుపతిలో మరణించా రు. 16న తన స్వస్థలమైన కడపలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ఆయన హెలెన్ కెల్లర్స్ స్కూల్ ఫర్ ది డెఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక స భ్యుడు, కార్యనిర్వాహక సభ్యులలో ఒకరు. గురువారం మల్కాజిగిరి నేరేడ్‌మెట్‌లోని హెలెన్ కెల్లర్స్ స్కూల్ ఫర్ ది డెఫ్లోలో స్థాపకుడు చైర్మన్ పటాన్ ఉమ్మార్ ఖాన్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు ఘన నివాళులర్పించారు. లయన్ పటాన్ ఉమ్మార్ ఖాన్ మాట్లాడుతూ.. రామాంజనేయులు శాస్త్రీయ నృత్యం, నాటక రంగంలో దిగ్గజం అని కొనియాడరు.