4 July, 2026 | 11:36 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

హాస్టల్ పైనుంచి దూకి విద్యార్థిని మృతి

28-06-2025 12:00 AM

మంచిర్యాల, జూన్ 27 (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణం లోని సాంఘీక సం క్షేమ మహిళా డిగ్రీ కళాశాల బీఎస్సీ బీజడ్సీ విద్యార్థిని హైదరాబాద్‌లో వైద్యం పొందు తూ శుక్ర వారం మృతి చెందింది.  వివరాల్లోకి వెళితే... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్తిడ్ గ్రామానికి చెందిన స్వప్న (19) మంచిర్యాల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతుంది.

మంగళవారం అర్ధరాత్రి హాస్టల్ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడగా హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యం పొందుతూ శుక్రవారం ఉద యం మూడు గంటల ప్రాంతంలో స్వప్న మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరా లేదు.

స్వప్న మృతి చెందిన విష యం తెలుసుకున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బీఆ ర్‌ఎస్ నాయకులు, విద్యార్థి సం ఘాల నాయకులు శుక్రవారం మధ్యాహ్నం మంచిర్యాల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ముందు ఆందోళన నిర్వహించారు.

స్వప్న కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి కారకులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పోలీసులు కళాశాల వద్దకు చేరుకొని ఆందోళనను విరమింపజేశారు.