calender_icon.png 14 July, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో ఘనంగా ఊర పండగ

14-07-2025 12:00:00 AM

నిజామాబాద్ నగరంలో  కొలువు దీరుతున్న గ్రామదేవతలు 

నిజామాబాద్, జులై 13 (విజయ క్రాంతి):  నిజామాబాద్ భాగ్యనగరంలో లస్కర్, ఉజ్జయిని బోనాల ఉత్సవాల తర్వాత రెండో స్థానంలో  నిజామాబాద్ దగ్గర లో ఉర పండగ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే పూర్వ పండగ ఈ ఏడు కూడా అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరం లోని పలు వీధుల్లో అమ్మవారి మరణతో మారుమోగాయి. ఊరి అరిష్టం తొలగిపోయేలా ఫులోరియా అంటూ భక్తుల నినాదాలతో రామదేవతల విగ్రహాలు ఊరేగింపు ప్రాంతం అంతా హోరెత్తింది.

అమ్మవార్ల విగ్రహాల ఊరేగింపు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. గత 90 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఇంద్రుడు ఉరవ పండుగకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని ఆయన తెలిపారు.  ఈ శోభయాత్రకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షణలో గట్టి బందోబస్తు నిర్వహించారు జిల్లా రఘునాథ ఆలయం నుండి ప్రారంభమైన గ్రామదేవతల ఊరేగింపు గాజుల్పేట్ పెద్ద బజార్ గోల హనుమాన్ పొలాన్ చౌరస్తా ఆర్య నగర్ వినాయక నగర్ దుబ్బా తదితర ప్రాంతాల నుండి కొనసాగింది.

సమస్యాత్మకమైన సున్నిత ప్రాంతాలలో గట్టి పోలీస్ పికెటింగ్ నిర్వహించారు. ఉరవకొండ సందర్భంగా హాజరైన సాయి చైతన్య మాట్లాడుతూ నిజామాబాద్ ప్రజలందరికీ ఊర పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామదేవతల ఆశీర్వాదంతో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించాలని ఆయన కోరారు. నగరంలో  దశాబ్దాల చరిత్ర కలిగిన ఊర పండగ ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.  నగరంలోని   ప్రాంతంలో తేలు మైసమ్మ గద్దె నుంచి దేవతామూర్తుల ప్రతిష్టాపనకు ఉత్సవమూర్తులను ఊరేగింపు భక్తులు తీసుకెళ్లారు. జిల్లా అధికార యంత్రంగం పర్యవేక్షణలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఉర పండుగ సంబరాలు ప్రారంభ అయ్యాయి. 

తేలు మైసమ్మ గద్దె నుంచి  పెద్దమ్మ, పోచమ్మ, పగ డాలమ్మ, సార్గమ్మ,కొండల రాయుడు, భోగంసాని, మహాలక్ష్మమ్మ, రాట్నం (ఆసు), పెద్దపులి ప్రతిమలను వేడుకగా ఊరేగించారు ఊరేగింపు పెద్ద బజార్, కోట గల్లి,జండగల్లి, వినాయక్ నగర్, మహాలక్ష్మి నగర్ ప్రాంతాలలో అమ్మవార్లను ప్రతిష్టించేందుకు ఊరేగింపు కొనసాగింది. ఈ ఊరేగింపులో జొన్నలు, పసుపు, కుంకుమలతో చేసిన సరి క్లస్టర్ ఊరేగిస్తూ ఊరేగింపు సందర్భంగా భక్తులకు పంపిణీ చేశారు. దారి పొడవునా మేకలు కోళ్లను బలిస్తూ భక్తులు  తమ మొక్కులను చెల్లించుకున్నారు. 

 ప్రత్యేక పూజలు సందర్భంగా భక్తుల ను అమ్మవారు ఆవహించిన పూనకాలతో ఊగిపోయారు. పులోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపు ముందుకు సాగింది. ముందుగా నిర్వహించిన రూట్ మ్యాప్ ప్రకారంగా శోభయాత్ర జరిగింది శోభయాత్ర జరిగే ప్రాంతాల్లో గట్టి బంధం నిర్వహించారు నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి ట్రాఫిక్ ఏసిపి మస్తానని స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం సిఐలు ఎస్త్స్రలు బందోబస్తును పర్యవేక్షించారు. ఈ అమ్మవార్ల ఊరేగింపు ప్రతిష్టాపన సాయంత్రం వరకు కొనసాగుతుంది.